: లోక్‌సభలో విపక్ష సభ్యుల నినాదాలు.. గందరగోళం.. రేపటికి వాయిదా
వాయిదా అనంతరం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో మళ్లీ గందరగోళం నెలకొంది. ప్రధాని మోదీ ప్రజల సమస్యలు వినాలని తాము కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని అయితే, ప్రధాని మోదీ వచ్చి పెద్దనోట్లపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. అనంతరం విపక్ష సభ్యులు పెద్దనోట్లపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేయండంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాజ్యసభలోనూ పెద్ద నోట్ల రద్దుపై పెద్ద ఎత్తున గందరగోళం నెలకొనడంతో ఈ రోజు మధ్యాహ్నం 12.32 వరకు సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు.