: అర్థం లేకుండా సభను అడ్డుకుంటున్నారు: కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
పార్లమెంటు ఉభయసభలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. ఇరు సభల్లోనూ పెద్దనోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని వచ్చి సమాధానం చెప్పాలని రాజ్యసభలో విపక్షనేతలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలకు ముందే విపక్షాలతో భేటీ జరిగిందని, పార్లమెంటులో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు విపక్షాలు తెలిపాయని, అయితే ఇప్పుడు అర్థం లేకుండా చర్చలకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఛైర్మన్ పోడియంను విపక్ష నేతలు చుట్టుముట్టారు.