: హీరోయిన్ అవికా గోర్ కు అశ్లీల మెసేజ్ లు పంపుతున్న టాలీవుడ్ యంగ్ హీరో !
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో నటించి, ఆపై హీరోయిన్ గా అందరి మనసులను దోచుకుంది అవికా గోర్. ఇప్పటి వరకు 5 టాలీవుడ్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే, టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో అవికాను వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆశ్లీల పదాలు, అసభ్య సందేశాలను వాట్సాప్ ద్వారా పంపుతున్నాడట. అయితే, ఈ మెసేజ్ లు ఎవరు పంపుతున్నారో మొదట ఆమెకు అర్థం కాలేదట. ఇదంతా ఎవరో ఆకతాయి చేస్తున్న పని అనుకుంది. కానీ, ఓ యంగ్ హీరో ఈ మెసేజ్ లు పంపుతున్నాడని తెలుసుకుని షాక్ కు గురైందట. ఈ విషయాన్ని తనకు మంచి మిత్రులైన సాయి ధరమ్ తేజ్, రాజ్ తరుణ్, నిఖిల్, రకుల్ ప్రీత్, హెబ్బా పటేల్ లతో చెప్పుకుని అవికా గోర్ చాలా బాధపడిందట. తెలుగులో నటించాలంటేనే విరక్తి కలుగుతోందని వారితో ఆవేదన వ్యక్తం చేసిందట అవికా. అయితే, ఆ మెసేజ్ లు పంపిన యంగ్ హీరో ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా వుంది. మరోవైపు, హీరోయిన్ రాధికా ఆప్టే కూడా గతంలో ఇలాంటి ఆరోపణలే చేసింది.