: మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి రామ్ నరేష్ యాదవ్ కన్నుమూత


మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రామ్ నరేష్ యాదవ్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ లో జనతాదళ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 1977లో ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వర్తించారు. 2011లో యూపీఏ హయాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని కుదిపేసిన వ్యాపం కుంభకోణంలో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది.

  • Loading...

More Telugu News