: ఉపఎన్నికలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఘన విజయం
తమిళనాడు, పుదుచ్చేరిల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని తంజావూరు, తిరుపరకుండ్రం, అరవకురిచ్చి, పుదుచ్చేరిలోని నెల్లితోప్పు నియోజకవర్గాలకు శనివారం నాడు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నెల్లితోప్పు నుంచి పోటీ చేసిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఘన విజయం సాధించారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తి శేఖర్ పై 11,151 ఓట్ల తేడాతో ఆయన జయభేరి మోగించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది.