: వచ్చింది 67 వేల మందే అయినా రూ. 4.18 కోట్ల ఆదాయం... భక్తులు తగ్గినా వెంకన్నకు రికార్డు ఆదాయం


భక్తులు గణనీయంగా తగ్గినప్పటికీ, హుండీ ఆదాయం తిరుమలలో గణనీయంగా పెరిగింది. కరెన్సీ కష్టాలతో భక్తుల రద్దీ తగ్గినప్పటికీ, అనూహ్యంగా హుండీ ఆదాయం పెరగడానికి పాత నోట్ల రద్దే కారణమని తెలుస్తోంది. నిన్న స్వామివారిని 67,241 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 4.18 కోట్ల ఆదాయం లభించింది. సోమవారం నాడు 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారని అధికారులు తెలిపారు. కాగా, భక్తులు తమ వద్ద ఉన్న పాత నోట్లను తీసుకొచ్చి కానుకల రూపంలో హుండీల్లో వేస్తున్నందునే ఆదాయం గణనీయంగా పెరిగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News