: బౌలర్ల వీరవిహారం... ఒకే రోజు 23 వికెట్లు
రంజీ మ్యాచ్ లో బౌలర్లు వీరవిహారం చేశారు. చెలరేగిన బౌలర్లు ఒకేరోజు 23 వికెట్లు తీయడం విశేషం. హర్యాణాలోని లాహ్లీ వేదికగా బరోడా, బెంగాల్ జట్ల మధ్య రంజీ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బరోడాను టీమిండియా పేసర్ అశోక్ ధిండా దారుణంగా దెబ్బతీశాడు. బరోడా 97 పరుగులకు ఆలౌట్ కాగా, బెంగాల్ బౌలర్ అశోక్ ధిండా 45 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగాల్ జట్టు మరింత పేలవ ప్రదర్శన చేసింది. దీంతో అతిత్ సేథి (6/45) ధాటికి కేవలం 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బరోడా మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఇలా ఒకేరోజు మొత్తం 23 వికెట్లు పడ్డాయి.