: 2,000 నోటుపై జాతీయ జంతువు ఏది?: మమతా బెనర్జీ ప్రశ్న


దేశంలో కొత్తగా చలామణిలోకి వచ్చిన 2,000 రూపాయల నోటుపై జాతీయ జంతువు బెంగాల్ టైగర్ ఏదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, ఇదేదో పొరపాటున జరిగిన తప్పిదం కాదని అన్నారు. వారికి ఏది నచ్చితే అదే చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 2,000 రూపాయల నోటుపై జాతీయ వారసత్వ జంతువైన ఏనుగు ఉన్నప్పుడు, జాతీయ జంతువైన పులి ఎందుకు లేదని ఆమె నిలదీశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న పది రూపాయల నోటుపై పులి, ఏనుగు, ఖడ్గమృగం చిత్రాలు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. కాగా, 2000 రూపాయల నోటుపై ఒక వైపు మహాత్మాగాంధీ, రెండోవైపు మంగళ్‌ యాన్‌ ఉపగ్రహాన్ని ముద్రించగా, కిందన చిన్న బాక్సుల్లో ఏనుగు, నెమలి, కమలాన్ని పోలిన పుష్పాన్ని ముద్రించారు. ఇక్కడ వారసత్వ జంతువు, జాతీయ పక్షికి స్థానం కల్పించినప్పుడు జాతీయ జంతువుకు ఎందుకు స్థానం కల్పించలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News