: యూపీలో దారుణం.. బ్యాంకు వద్ద తొక్కిసలాటలో ఒకరి మృతి


పెద్దనోట్ల మార్పిడి కోసం బ్యాంక్ కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఈరోజు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ లోని దేవరియాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వద్ద పెద్దనోట్లు మార్చుకునేందుకు ప్రజలు బారులు తీరారు. బ్యాంక్ మూసేసే సమయం దగ్గర పడుతున్నప్పటికీ క్యూ ఏమాత్రం తగ్గలేదు. దీంతో, పెద్దనోట్లు మార్చుకోవాలన్న తొందరలో తొక్కిసలాట మొదలైంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News