: బ్యాంకు రుణాలు చెల్లించాల్సిన ఖాతాదారులకు అదనపు గడువు: ఆర్బీఐ


పెద్దనోట్ల రద్దు ప్రభావం కారణంగా బ్యాంకుల్లో పలు రుణాలు తీసుకున్న ఖాతాదారులు సరైన సమయంలో తిరిగి చెల్లించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. కోటి రూపాయల వరకు తీసుకున్న గృహ, కారు, పంట రుణాలతో పాటు ఇతర రుణాలు చెల్లించడానికి మరో రెండు నెలలు అంటే 60 రోజుల పాటు అదనపు గడువు ఇచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు చెల్లించాల్సిన అన్ని రకాల రుణాలకు ఈ అదనపు గడువు వర్తిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. కోటి రూపాయల లోపు వర్కింగ్ క్యాపిటల్ గా తీసుకున్న సంస్థలకూ ఈ గడువు వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది.

  • Loading...

More Telugu News