: మోదీ పదవీకాలం ముగిసిన తరువాత 2 వేల నోటు చెల్లదు: జీవన్ రెడ్డి


పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకొచ్చిన కొత్త నోట్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పదవీకాలం ముగిసిన అనంతరం ఇప్పుడు విడుదల చేసిన 2 వేల రూపాయల నోటు చెల్లదని అన్నారు. మోదీ తాత్కాలిక ప్రధాని మాత్రమే అని వ్యాఖ్యానించిన జీవన్ రెడ్డి, కొత్త నోట్లపై మోదీ ప్రసంగం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News