: ఉద్యోగుల జీతాలకు ఢోకా లేదు: మంత్రి ఈటల
ఉద్యోగుల జీతాలకు ఢోకా లేదని, బ్యాంకు అకౌంట్ల ద్వారా జీతాలు చెల్లిస్తామని, నగదు చెల్లింపులకు నో ఛాన్స్ అని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వచ్చిందని అన్నారు. అప్పుల కోసం ఎఫ్ఆర్ బీఎం పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరతామని, రూ.1500 కోట్ల రుణం ఇవ్వాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. సహకార బ్యాంకులకు నగదు మార్పిడి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఈటల చెప్పారు.