: ఆరు వారాల పాటు 'సీడీఎం'లు పనిచేయవట!
పెద్దనోట్లను బ్యాంక్ కు వెళ్లి డిపాజిట్ చేయడం వీలుకాని పక్షంలో క్యాష్ డిపాజిట్ మెషీన్ (సీడీఎం) లను ప్రజలు ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సేవలకు కూడా మంగళం పాడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, కొత్తగా వచ్చిన నోట్లకు సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్లను దేశ వ్యాప్తంగా ఉన్న సీడీఎంలలో ఫీడ్ చేయాల్సి ఉంది. ఇందుకు చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. సుమారు ఆరు వారాల పాటు సీడీఎంలు పనిచేయకపోవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా సీడీఎంలు తయారు చేసే ఎస్.సి.ఆర్ కంపెనీ ఎండీ, సీఈఓ నవ్రోజి దస్తూర్ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా మొత్తం ముప్ఫై వేల వరకు సీడీఎంలు ఉన్నాయని, కొత్తనోట్లను, నకిలీ నోట్లను గుర్తించేందుకు అనుగుణంగా సీడీఎంలలో సాఫ్ట్ వేర్ మార్చేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు.