: కాళ్లు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా... లేదంటే, జుట్టు పట్టుకుని ఉతకడానికి కూడా సిధ్ధమే: జేసీ దివాకర్ రెడ్డి


అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతపురం అభివృద్ధికి ఎమ్మెల్యే, కమిషనర్, మేయర్ అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ ముగ్గురూ కుమ్మక్కై రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అనంతపురం అభివృద్ధి కోసం తాను ఎవరి కాళ్లయినా సరే పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. 'అవసరమైతే చేతులు పట్టుకుంటా... లేదంటే కాళ్లు పట్టుకుంటా.. అదీకాకపోతే జుట్టు పట్టుకుని ఉతికైనా సరే అనంతపురాన్ని బాగుచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా'నని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News