: గాయం కారణంగా మూడో టెస్టుకు బ్రాడ్ దూరం


ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మూడో టెస్టుకు దూరం కానున్నాడు. విశాఖపట్టణం వేదికగా జరిగిన రెండో టెస్టులో కుడిపాదం గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డ బ్రాడ్ కు విశ్రాంతినివ్వాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. దీంతో ఈనెల 26 నుంచి మొహాలీ వేదికగా టీమిండియాతో జరగనున్న మూడో టెస్టులో తాను అడే అవకాశం లేదని బ్రాడ్ తెలిపాడు. ముంబై వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో తిరిగి ఆడగలనన్న విశ్వాసాన్ని బ్రాడ్ వ్యక్తం చేశాడు. దీంతో మూడో టెస్టులో బ్రాడ్ స్థానంలో మరో ఆటగాడికి జట్టులో స్థానం కల్పించనున్నారు.

  • Loading...

More Telugu News