: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు!


అనంతపురం అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుపడుతున్నారంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. జేసీని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీంతో, చర్చి కూడలి వద్ద టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేస్తున్నారు. కాగా, అంతకుముందు జేసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్ల విస్తరణ పనులను అనంతపురం ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రోడ్ల విస్తరణ కోసం సీఎం చంద్రబాబు రూ.70 కోట్లు మంజూరు చేశారని అన్నారు. రాజకీయం చేస్తూ రోడ్ల విస్తరణ పనులను అడ్డుకోవడం చాలా బాధ కలిగిస్తోందని, అభివృద్ధికి సహకరించే వారి కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధమేనని, రోడ్ల విస్తరణ పనులు జరిగేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని జేసీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News