: హైద‌రాబాద్‌కి రూ.500 నోట్లు వచ్చేస్తున్నాయ్!


పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌భావంతో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను తెలుసుకుంటున్న ఆర్‌బీఐ వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌జ‌ల‌కు త‌గినంత న‌గ‌దును అందుబాటులోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. ఇప్ప‌టికే దేశంలో ప‌లు న‌గ‌రాల్లో రూ.500 కొత్త నోట్లు జారీ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే, హైద‌రాబాద్‌లో మాత్రం రెండు వేల నోటు మిన‌హా ప్ర‌జ‌ల‌కు వేరే నోట్లు దొర‌క‌ని పరిస్థితి ఉంది. కొన్ని ఏటీఎం కేంద్రాల్లోనే రూ.100 నోట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వచ్చే శనివారానికల్లా కొత్త రూ.500 నోట్లు హైద‌రాబాద్‌కు వ‌చ్చేస్తాయ‌ని అధికారులు తెలిపారు. నోట్ల త‌ర‌లింపు కోసం అధికారులు హెలికాఫ్టర్లను కూడా ఉప‌యోగిస్తున్నారు. తగిన‌న్ని చిన్న నోట్లు లేకపోవడంతో సామాన్యుడు ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కుంటున్నాడ‌ని బ్యాంకు యూనియన్లు కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేప‌థ్యంలోనే ఐదు రోజుల్లో హైద‌రాబాద్‌కి రూ.500 నోట్లు రానున్నాయి.

  • Loading...

More Telugu News