: 110 ఏళ్ల తరువాత 'కింగ్ పెయిర్' రికార్డును బద్దలు కొట్టిన ఆండర్సన్
110 ఏళ్ల తరువాత ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ బ్యాటింగ్ లో ఒక రికార్డును బద్దలు కొట్టాడు. విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో 246 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ టీమిండియా బౌలర్ అశ్విన్ వేసిన బంతిని ఎదుర్కోవడంలో తడబడి ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఇక ఇదే టెస్టులో ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన ఆండర్సన్ ను టీమిండియా బౌలర్ జయంత్ యాదవ్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ చేశారు. దీంతో టెస్టుల్లో కింగ్ పెయిర్ గా ఆండర్సన్ అవుట్ రికార్డులకెక్కింది. కింగ్ పెయిర్ అంటే ఒక టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటవ్వడం. అయితే ఇంగ్లండ్ క్రికెట్ లో 110 సంవత్సరాల తర్వాత ఆ విధంగా ఔటైన ఇంగ్లండ్ క్రికెటర్ గా నిలిచాడు అండర్సన్. అంతకుముందు 1906లో ఇంగ్లండ్ ఆటగాడు ఎర్నీ హెయిస్ సౌతాఫ్రికాపై ఈ విధంగా ఔటవ్వడం విశేషం.