: కాన్పూర్‌ రైలు ప్రమాదంపై అసలు కారణాలను వెల్లడించిన అధికారులు


ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిన్న ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకొని 140 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి పట్టాలు విరిగిపోవడమే కారణమని అంద‌రూ అనుకున్నారు. అయితే, రైలు సామర్థ్యానికి మించి అధిక సంఖ్య‌లో ప్ర‌యాణిస్తుండ‌డ‌మే అస‌లు కార‌ణ‌మ‌ని సంబంధిత అధికారులు ఈ రోజు మీడియాకు తెలిపారు. స‌ద‌రు రైలులో మొత్తం 1200 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్న అధికారులు... వారిలో దాదాపు 600 మంది ప్రయాణికులు టికెట్‌ లేకుండానే ఉన్నారా? లేక జనరల్‌ టికెట్‌పై ప్ర‌యాణిస్తున్నారా? అన్న అంశాన్ని గుర్తించలేకపోతున్నట్లు తెలిపారు. ప్ర‌మాదం అనంత‌రం త‌న మ‌ర‌ద‌లుని వెతుకుతున్న రాజారామ్‌ అనే వ్యక్తిని తాము ప్ర‌శ్నించామ‌ని, ఆమె శ‌నివారం రైలు ఎక్కింది కానీ ఆమె ఏ కోచ్‌లో ఉందో త‌న‌కి తెలీదని అత‌డు చెప్పాడని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ మ‌హిళ పేరు వెయిటింగ్‌ లిస్ట్‌లోనే ఉందని, కానీ రైలు ఎలా ఎక్కిందో తెలీడంలేదని వ్యాఖ్యానించారు. టికెటు తీసుకోకుండా ఏదో ఒక కోచ్‌లోకి ప్ర‌వేశించి ప్ర‌యాణిస్తోన్న వారు కూడా ఎంతో మంది ఉంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News