: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అరుదైన ఫొటోల్లో ఇదొకటి!


అలహాబాద్ లో కాసేపట్లో ప్రారంభించనున్న ఎగ్జిబిషన్ లో దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి సంబంధించిన అరుదైన ఫొటోలను ఏర్పాటు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీలు ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్న ఇందిరాగాంధీ ఫొటోలలో చాలా మటుకు సోనియా గాంధీయే స్వయంగా సెలక్ట్ చేశారని సమాచారం. ఈ ఫొటోలలో ఇందిర, ఫిరోజుల వివాహం, కాశ్మీర్ లో హనీమూన్ కు వెళ్లినప్పుడు వారు దిగిన ఫొటోలతో పాటు చిన్నారి రాజీవ్ గాంధీని ఎత్తుకున్న ఇందిరతో తండ్రి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర, సోనియాలు కలిసి ఉన్న మరికొన్ని ఫొటోలు కూడా ఉన్నాయి.

  • Loading...

More Telugu News