: చిరుతపులి ముందు స్థాన బలం ఓడిపోయింది!


జీవిత సత్యాలను ఎన్నిటినో విపులీకరించిన వేమన శతకంలోని ఓ పద్యాన్ని చిరుతపులి రివర్స్త చేసింది. వివరాల్లోకి వెళ్తే... నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు... బయట గుక్క చేత భంగపడు... స్థాన బలముగాని తన బలిమికాదయా విశ్వదాభిరామ వినురవేమ... అన్నది శతకంలో ఓ పద్యం. 'కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్'గా పేర్కొనే చిరుతపులి ఆకలితో ఉంటే ఎంత సాహసానికైనా దిగుతుందని నిపుణులు చెబుతుంటారు. అలాంటి చిరుత ఒకటి నీళ్లలో ఉన్న మొసలిని చూసింది. చుట్టూ ఎలాంటి ఆహారం కనిపించకపోవడంతో అమాంతం ఎగిరి మొసలిపై దూకింది. ఒడుపుగా దాని మెడపట్టుకుంది. దీంతో ఎటూ కదల్లేకపోయిన మొసలి గిలగిల్లాడుకున్నా చిరుత పట్టునుంచి తప్పించుకోలేకపోయింది. దానిని నీళ్లలోంచి ఒడ్డుకి ఈడ్చుకొచ్చిన చిరుతుపులి దాని పీక కొరికి చంపేసింది. అనంతరం దానితో పాటుగా ఉన్న మరో మగచిరుతపులి కూడా ఆ విందులో భాగం పంచుకోవడం విశేషం. కాగా, బ్రెజిల్‌ అడవుల్లో షూటింగ్ కోసం వచ్చిన ఓ టీమ్ కంట ఈ దృశ్యం పడింది. దీంతో వారు దీనిని తమ కెమెరాలో బంధించారు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News