: ‘అందరినీ తొలగించండి’.. బీసీసీఐకి జస్టిస్ లోథా కమిటీ మరో భారీ షాక్
బీసీసీఐలో ప్రక్షాళన కోసం కొన్ని నెలల క్రితం జస్టిస్ ఆర్.ఎం లోథా కమిటీ చేసిన పలు సూచనలపై బీసీసీఐ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా బీసీసీఐకి జస్టిస్ లోథా కమిటీ మరో ఝలక్ ఇచ్చింది. బోర్డులో సంస్కరణలకు మరిన్ని కొత్త సిఫారసులను ఈ రోజు సుప్రీంకోర్టుకు అందించింది. అందులో ప్రస్తుతం బీసీసీఐ పదవుల్లో ఉన్న సభ్యులందరినీ తొలగించాలని పేర్కొంది. బీసీసీఐ పరిశీలకుడిగా బాధ్యతలను మాజీ హోం శాఖ కార్యదర్శి జీకే పిళ్లైకి అప్పగించాలని తన నివేదికలో పేర్కొంది.