: మరింత వేడెక్కనున్న యూపీ ఎన్నికలు... ఆర్ఎల్డీ, జేడీయూ కూటమి ఏర్పాటు
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ సమాజ్‌వాదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ఆ రాష్ట్రంలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్రంలో పోటీ చేయడానికి ఆర్ఎల్డీ, జేడీయూ కూటమి ఏర్పాటయింది. ఈ రోజు లక్నోలో సమావేశమైన ఇరు పార్టీల కీలక నేతలు కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.