: బ్యాంకు నుంచి రద్దయిన పెద్దనోట్లను దోచుకుపోయిన దుండగులు


పెద్దనోట్లను వదిలించుకోవాలని సామాన్య ప్రజలు, నల్లధనవంతులు చూస్తున్న తరుణంలో ఒక ఆశ్చర్యకరమైన దోపిడీ కాశ్మీర్ లో ఈరోజు జరిగింది. ముసుగులు ధరించిన, సాయుధులైన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాంకులోకి చొరబడి పాత నోట్లను దోచుకుపోయారు. శ్రీనగర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పోరాలోని జమ్మూ, కాశ్మీర్ బ్యాంకులోకి నలుగురు దుండగులు చొరబడ్డారు. మొత్తం రూ.13 లక్షలను దుండగులు దోచుకుపోయారు. ఇందులో పదకొండు లక్షల వరకు రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, ఉగ్రవాదులే ఈ పనికి పాల్పడి ఉంటారని తాము అనుమానిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News