: సీబీఐతో విచారణ లేనట్లే.. గనుల కేటాయింపు కేసులో రాజస్థాన్ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట
గనుల కేటాయింపులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ అంశాన్ని సీబీఐ అధికారులతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రామ్‌సింగ్ కస్వా 2014లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈ రోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు వసుంధర రాజెకు ఊరట కలిగిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.