: పెళ్లి ఖర్చులపై ఆరా.. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలపై ఐటీ శాఖ దాడులు
మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ పై ఆరోపణలు ఎదుర్కుంటున్న గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇటీవల జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్భంగా జరిగిన ఖర్చుతో పాటు పలు అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బళ్లారిలోని ఓబులాపురం మైన్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక కార్యకర్త టి.నరసింహమూర్తి ఆదాయపు పన్ను డైరెక్టర్ జనరల్‌కు చేసిన ఫిర్యాదుతో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.