: వందేళ్ల వృద్ధుడి తలను నరికి వేసిన ఐసిస్ ఉగ్రవాదులు


ఈజిప్ట్ లోని సినాయ్ ద్వీపకల్పంలో ఐఎస్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. వందేళ్ల వృద్ధుడు, సూఫీ మత గురువు అయిన షేక్ సులేమాన్ అబుహరజ్ తలను నరికివేశారు. షేక్ సులేమాన్ మంత్రగాడనే నెపంతో ఆయన్ని ఇంటి నుంచి ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అనంతరం, ముసుగులు ధరించిన ఉగ్రవాదులు చాలా క్రూరంగా ఆ వృద్ధుడి తలను నరికివేశారు. ఈ దారుణ దృశ్యాలను చిత్రీకరించిన ఉగ్రవాదులు, ఆ వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోతో పాటు, ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News