: కేసీఆర్ గృహప్రవేశాన్ని అడ్డుకుంటాం: టీఎన్ఎస్ఎఫ్


విద్యార్థుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని టీఎన్ఎస్ఎఫ్ మండిపడింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ ధర్నా చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ, బకాయిలను విడుదల చేయడానికి ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు విధిస్తున్నామని చెప్పారు. ఈలోగా రూ. 2090 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పారు. తాము ఇచ్చిన సమయంలోగా బకాయిలను విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గృహ ప్రవేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News