: కాబూల్ మసీదులో ఆత్మాహుతి దాడి..13 మంది మృతి
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లో దారుణం చోటు చేసుకుంది. షియా మతస్తుల మసీదు వెలుపల ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో మసీదు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతున్నదో తెలియక పరుగులు తీశారు. ఈ సంఘటనకు ఎవరు బాధ్యులనే విషయమై ఎటువంటి ప్రకటనా ఇంతవరకు వెలువడలేదు.