: ఈ నెల 10 నుంచి 18 వ‌ర‌కు రూ.5,44,571 కోట్ల డిపాజిట్.. రూ.1,03,316 కోట్లు విత్ డ్రా: ఆర్‌బీఐ


పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న అనంతరం జ‌రిగిన ఖాతాదారుల లావాదేవీల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. ఈ నెల 10 నుంచి 18 వ‌ర‌కు రూ.5,44,571 కోట్ల పాత నోట్ల‌ డిపాజిట్ జ‌రిగిన‌ట్లు పేర్కొంది. ఇందులో రూ.5,11,565 కోట్లను బ్యాంకుల్లో జ‌మ‌చేశారని, మ‌రో రూ.33,006 కోట్ల న‌గ‌దు మార్పిడి జ‌రిగిందని తెలిపింది. ఏటీఎంలు, బ్యాంకుల నుంచి ప్ర‌జ‌లు మొత్తం రూ.1,03,316 కోట్లు విత్ డ్రా చేసుకున్నార‌ని చెప్పింది. ప్ర‌జ‌ల ఇబ్బందులను తీర్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News