: పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం


ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే పృథ్వి-2 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందిపూర్ టెస్ట్ రేంజ్ లో భారత సైన్యం ఈ క్షిపణిని రెండు సార్లు వెంటవెంటనే ప్రయోగించింది. స్ట్రాటెజిక్ ఫోర్స్ కమాండ్, డీఆర్డీఓ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో, శిక్షణ కసరత్తుల్లో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించారు. 2009 అక్టోబర్ 12న ఇలాంటి పరీక్షలు రెండింటిని నిర్వహించారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన క్షిపణుల్లో ర్యాండమ్ చెకప్ లో భాగంగా ఈ రోజు పరీక్షలు నిర్వహించారు. ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలదు. 500, 1000 కిలోల వార్ హెడ్లను ఈ క్షిపణులు మోసుకుపోగలవు.

  • Loading...

More Telugu News