: తండ్రి కాబోతున్న నాని.. 'ఒక గొప్ప సంతోషం వస్తోందంటూ' ఫేస్ బుక్ లో పోస్ట్!


సహజనటుడు నాని తండ్రి కాబోతున్నాడనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్త వాస్తవమేనంటూ నాని టీమ్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసింది. ‘ఒక గొప్ప సంతోషం రాబోతోంది. ఆ ఆనందకరమైన వార్తను వినేందుకు మేమందరం ఎంతో ఉత్సాహంగా ఉన్నాము..’ అని ఆ పోస్ట్ లో పేర్కొంది. దీంతో పాటు ఒక ఫొటో కూడా పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో నాని, అంజలి దంపతులతో పాటు వారి సన్నిహితులు ఉన్నారు.

  • Loading...

More Telugu News