: 'సంసద్ యాత్ర'కు సుష్మస్వరాజ్ సంఘీభావం


ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జేఏసీ 'సంసద్ యాత్ర' పేరుతో రెండవ రోజు కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షలో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. దీక్ష చేస్తున్న నేతలకు తన సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడిన సుష్మ, వెయ్యిమంది ప్రాణాలు పోగొట్టుకున్నా కాంగ్రెస్ మౌనంగానే ఉందని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందని చెప్పారు. యూపీఏ తెలంగాణ ఏర్పాటు చేయకపోతే 2014 లో బీజేపీ ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా, బీజేపీ నేతలు విద్యాసాగర్ రావు, స్మృతీ ఇరానీ తదితరులు దీక్షా స్థలం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు.

  • Loading...

More Telugu News