: ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది: పెద్ద‌నోట్ల ర‌ద్దుపై చంద్ర‌బాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అక్క‌డ నిర్మించిన 5 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకొచ్చిన‌ రూ.2000 నోటుతో పేదలకు ప్రయోజనం ఉండదని అన్నారు. న‌ల్ల‌ కుబేరులకు బుద్ధి చెప్పే ఉద్దేశంతోనే పెద్దనోట్ల రద్దు నిర్ణ‌యం తీసుకున్నార‌ని, అయితే, దీంతో దేశంలో పలు సమస్యలు కూడా వ‌చ్చాయ‌ని చెప్పారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో మున్ముందు నగదు లావాదేవీలు తగ్గే అవకాశం ఉందని, ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరుగుతాయ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News