: సూసైడ్ బెల్టును ధరిస్తుండగా పేలడంతో ఉగ్రవాది సహా కుటుంబ సభ్యుల మృతి
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఓ యువకుడు తన ఇంట్లో ఉన్న సమయంలో నడుముకి సూసైడ్ బెల్టును ధరిస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ యువకుడు తనతో పాటు తన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు. ఇరాక్‌లో ఎన్నో ఏళ్లుగా ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న మోసుల్ నగరంలో ఈ ఘటన జరిగింది. సదరు యువకుడు ఐఎస్ఐఎస్‌లో ‘కబ్స్ ఆఫ్ ది ఖలీఫా’ కింద పనిచేస్తున్నాడు. ఉగ్రవాదంలో చిన్నారులకు శిక్షణ ఇస్తుంటాడు. ఈ క్రమంలోనే తన నడుముకి బాంబు చుట్టుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాకీ సైన్యం తమ దాడులు కొనసాగిస్తూనే ఉంది.