: బెంగళూరులోని ఏటీఎంలను పరిశీలించి, ట్విట్టర్లో వివరాలను పోస్ట్ చేశాడు!
నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత దేశ వ్యాప్తంగా ప్రజలు నగదు కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏటీఎంలలో డబ్బులు దొరకడం లేదని, క్యూలైన్లు అర కిలోమీటరుకు పైగా ఉన్నాయని ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలన్నీ నిజమేనా? అని డౌట్ వచ్చింది బెంగళూరుకు చెందిన టిను అబ్రహం అనే వ్యక్తికి. తన అనుమానాన్ని తీర్చుకోవడానికి ఇంటి నుంచి కదిలి ఏటీఎంల చుట్టూ తిరిగాడు. బెంగళూరులో మొత్తం 23 ఏటీఎంలను పరిశీలించాడు. అన్ని ఏటీఎంల ఫొటోలను తీసిన టిను అబ్రహం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బెంగళూరులో ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎంలను పరిశీలించి ఏవేవి పనిచేస్తున్నాయి? ఏవి పనిచేయడం లేదు? అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. తన అనుమానం క్లియర్ చేసుకొని ఫొటోలతో సహా అన్ని వివరాలను తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఫాలోవర్లకు తెలిపాడు.