: ఇప్పుడు జడేజా వంతు... నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లు విలవిల్లాడుతున్నారు. వైజాగ్ లో జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజు తొలి సెషన్ లోనే వీరిద్దరూ మంచి స్పిన్ రాబడుతుండటంతో... ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ నానా తంటాలు పడుతున్నారు. ఈ రోజు ఆట ప్రారంభంలోనే డకెట్ వికెట్ ను అశ్విన్ పడగొడితే... నేనేం తక్కువ కాదన్నట్టుగా మొయిన్ అలీ వికెట్ ను జడేజా పడగొట్టాడు. జడేజా వేసిన బంతి బౌన్స్ కావడంతో, బ్యాట్ పైభాగాన్ని (షోల్డర్ ను) ముద్దాడుతూ బ్యాక్ వర్డ్ షార్ట్ లెగ్ దిశగా బంతి వెళ్లింది. ఏ మాత్రం పొరపాటు చేయకుండా కోహ్లీ క్యాచ్ పట్టడంతో... మెయిన్ పెవిలియన్ చేరాడు. దీంతో, డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. రూట్ (25), స్టోక్స్ (1) క్రీజులో ఉన్నారు.