: బంతి తిరుగుతోంది... మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్


విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కు కష్టాలు తప్పేలా లేవు. మ్యాచ్ చివరి రోజున పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలతో తొలి ఓవర్ నుంచే స్పిన్నర్లను కెప్టెన్ కోహ్లీ బరిలోకి దించాడు. అతని అంచనా ఏమాత్రం తప్పలేదు. నాలుగో ఓవర్ లో అశ్విన్ వేసిన బంతికి డకెట్ బోల్తా పడ్డాడు. గింగిరాలు తిరుగుతూ వచ్చిన బంతిని స్వీప్ చేయబోయాడు డకెట్. అయితే, ఆ బంతి ఎక్స్ ట్రా బౌన్స్ కావడంతో... టాప్ ఎడ్జ్ తీసుకుని, కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. డకెట్ ఔట్ కావడంతో, రూట్ (15)కి మొయిన్ అలీ జతకలిశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు. ఇంగ్లండ్ చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. గెలవాలంటే మరో 308 పరుగులు చేయాలి.

  • Loading...

More Telugu News