: ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. నోట్ల కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పలు ప్రాంతాల్లో కలియదిరిగిన రాహుల్... ఏటీఎంల ముందు బారులుతీరిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా, పాత నోట్ల ఉపసంహరణతో తాము పడుతున్న ఇబ్బందులను రాహుల్ తో సామాన్యులు పంచుకున్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, పెద్ద నోట్లను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయంతో తామెంత ఇబ్బందులు పడుతున్నామో రాహుల్ కు చెప్పారు. జనాలు చెబుతున్న విషయాలను రాహుల్ చాలా ఓపికగా విన్నారు. జహంగీర్ పూరి, ఆనంద్ పరబాత్, జకీరా, ఇంద్రలోక్ తదితర ప్రాంతాల్లో రాహుల్ పర్యటించారు.