: చాలా సంతోషంగా ఉంది..చెప్పడానికి మాటలు రావడం లేదు: పీవీ సింధు


చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ను కైవసం చేసుకోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘సూపర్ సిరీస్ గెలవడం అన్నది ఎన్నో రోజుల కల. చాలా సంతోషంగా ఉంది.. చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇది నా తొలి సూపర్ సిరీస్ టైటిల్. ఒలింపిక్స్ తర్వాత ఏంటని చాలా మంది ప్రశ్నించారు. నేను మళ్లీ విజయం సాధించడానికి చాలా కాలం పడుతుందని అనుకున్నారు. కానీ, నేను చాలా కష్టపడ్డా. తీవ్రంగా సాధన చేశాను. బాగా ఆడతానని అనుకున్నాను. రెండున్నరేళ్ల తర్వాత చైనా క్రీడాకారిణి సన్ యూతో తలపడ్డాను’ అని సింధు పేర్కొంది.

  • Loading...

More Telugu News