: రాజకీయ నాయకులు మోదీపై విమర్శలు మానుకోవాలి!: సినీ నటుడు నాగబాబు


వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోటును కూడా రద్దు చేసి, కొత్త నోటు తీసుకు వస్తే స్వచ్ఛమైన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు నాగబాబు విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దుపై గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచారని నాగబాబు కొనియాడారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ భవిష్యత్ ను మార్చడం తథ్యమని అన్నారు. ప్రజలందరూ మోదీ తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని కోరారు. పెద్దనోట్ల రద్దుపై రాజకీయనాయకులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజకీయ నాయకులు మోదీపై విమర్శలు మానుకోవాలని నాగబాబు కోరారు.

  • Loading...

More Telugu News