: విమానాన్ని ఆపేసిన కోతుల గుంపు!
టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా రన్ వే పై కోతులు కనపడటంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. విమానాన్ని ఆపేశాడు. ఈరోజు అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకుంది. అయితే, రన్ వే పై కోతులు ఉండటాన్ని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ అధికారులు వెంటనే పైలట్ కు సమాచారం అందించారు. దీంతో, ఎటువంటి ప్రమాదం జరగకుండా పైలట్ వెంటనే విమానాన్ని ఆపివేశాడని ‘స్పైస్ జెట్’ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.