: ఈ అవార్డు మా అమ్మకు అంకితం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
‘మా అమ్మకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అని సెంటీనరి అవార్డు స్వీకరించిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గోవాలో 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు రమేశ్ సిప్పీ ప్రారంభించారు. సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2016ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వెంకయ్యనాయుడు అందజేశారు. అనంతరం, బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, సినీ రంగంలో యాభై ఏళ్ల తన ప్రస్థానం ఫలప్రదంగా సాగిందని అన్నారు. కాగా, ఈ నెల 28 వరకు కొనసాగే ఈ చిత్రోత్సవంలో 90 దేశాలకు చెందిన మూడు వందల చిత్రాలను ప్రదర్శించనున్నారు.