: పవన్ కల్యాణ్ ని కలిసిన బండారు దత్తాత్రేయ.. కూతురు వివాహానికి ఆహ్వానం!
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కలిశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాదు, అన్నపూర్ణ స్టూడియోలో, 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ ని ఆయన కలిశారు. తన కుమార్తె వివాహ వేడుక కు హాజరుకావాలంటూ పవన్ కు శుభలేఖ అందజేశారు. కాగా, పవన్ ని కలిసేందుకు వెళ్లిన దత్తాత్రేయను పవర్ స్టార్ సాదరంగా ఆహ్వానించారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు సరదాగా ముచ్చటించుకున్నారు.