: అనకాపల్లి సమీపంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ
విశాఖపట్టణం జిల్లాలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. కోల్ కతా నుంచి హైదరాబాద్ కు సిగిరెట్ల లోడ్ తో వెళ్తున్న కంటెయినర్ ను అనకాపల్లి సమీపంలో దుండగులు అడ్డగించారు. డ్రైవర్ కాళ్లు, చేతులు కట్టేసి ఆ వాహనాన్ని దారి మళ్లించారు. ఆ వాహనంలోని రూ.5 కోట్ల విలువ చేసే సరుకును దోచుకుని దుండగులు పరారయ్యారు. బయ్యవరం దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఖాళీ కంటెయినర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.