: మాల్యాకు చేసినట్టే నా లోను కూడా మాఫీ చేయండి: బ్యాంకుకు 'సఫాయ్ వాలా' లేఖ


లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాలాంటి పెద్ద చేపలు తీసుకున్న అప్పులను రూ. 7వేల కోట్ల మేర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ లో సఫాయ్ వర్కర్ గా పనిచేస్తున్న బావూరావు సోనవానే ఎస్బీఐకి దిమ్మతిరిగేలా ఓ లేఖ రాశాడు. విజయ్ మాల్యా రుణాన్ని మాఫీ చేసిన ఎస్బీఐకి అభినందనలని... మాల్యాతో పాటు తన పాత రుణాన్ని కూడా మాఫీ చేయాలని లేఖలో బ్యాంకును కోరారు. తన కొడుకు అనారోగ్యం కారణంగా బ్యాంకు నుంచి రూ. లక్షన్నర లోన్ తీసుకున్నానని... ఆ రుణాన్ని మాఫీ చేయాలని కోరాడు. అయితే, తాను రాసిన లేఖకు బ్యాంకు నుంచి ఇంకా రిప్లై రాలేదని బావూరావు తెలిపాడు.

  • Loading...

More Telugu News