: పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా కొందరు వైఎస్సార్సీపీ ఎంపీలు టీడీపీలో చేరతారు: అచ్చెన్నాయుడు
పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా వైఎస్సార్సీపీ ఎంపీలు కొందరు టీడీపీలో చేరనున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎవరైతే తమ పార్టీలో చేరనున్నారో ఆ ఎంపీలు అందరూ తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, కర్నూల్ జిల్లా పాణ్యం ఆర్జీఎం కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి ఆత్మహత్య కేసును సీఐడీకి అప్పగించామని, ఈ కేసులో దోషులకు శిక్ష పడేవరకు చంద్రబాబు ప్రభుత్వం నిద్రపోదని అన్నారు.