: రెజ్లర్ గీతా ఫొగట్ వివాహా వేడుకుల్లో అమీర్ ఖాన్
ప్రముఖ మహిళా రెజ్లర్ గీతా ఫొగట్ వివాహా వేడుకలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ హాజరయ్యారు. హర్యానాలోని బలాలిలో ఈరోజు జరిగిన గీతా ఫొగట్ పెళ్లి వేడుకులకు అమీర్ హాజరై, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సాంప్రదాయక దుస్తులు ధరించి అక్కడికి వెళ్లిన అమీర్ ను సాదరంగా ఆహ్వానించారు. నాటి రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్, ఆయన కూతుళ్లు గీతా, బబితా ఫొగట్ లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, నాటి రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘దంగల్’ చిత్రంలో ప్రధాన పాత్రను అమీర్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫొగట్ కుటుంబంతో అమీర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చేనెల 23వ తేదీన ‘దంగల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.