: జిడ్డు బ్యాటింగ్ అంటే ఇదే... 38 ఓవర్లలో 50 రన్స్ చేసిన ఇంగ్లండ్


విశాఖలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఓపెనర్లు హమీద్, కుక్ లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. 405 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తాబేలు కూడా సిగ్గుపడే రీతిలో బ్యాటింగ్ చేస్తోంది. పరమ జిడ్డు బ్యాటింగ్ తో 38 ఓవర్లలో 50 పరుగులు చేసింది. భారీ లక్ష్యం ముందున్న నేపథ్యంలో, గెలవడం కష్టసాధ్యం కావడంతో... మ్యాచ్ ను కనీసం డ్రాగా ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. కొంచెం అటూ ఇటూ అయితే... భారత స్పిన్నర్లు చెలరేగిపోతారనే విషయం ఇంగ్లండ్ ఆటగాళ్లకు తెలుసు. అందుకే రన్స్ చేయడం కంటే... వికెట్ కాపాడుకోవడానికే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 51/0 (39 ఓవర్లు). కుక్ 34 పరుగులతో, హమీద్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News