: పివి సింధును కొనియాడిన చంద్రబాబు
చైనా సూపర్ సిరీస్ విజేత పివి సింధును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో సింధు పోరాటపటిమ భారతీయులకు స్ఫూర్తి అని కొనియాడారు. అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి తొలిసారి చైనా ఓపెన్ సిరీస్ టైటిల్ సాధించి తెలుగు యువతరానికి సింధు గర్వకారణంగా నిలిచిందని అన్నారు.